మలేషియాకు ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో మలేషియాలో పర్యటించనున్నారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో మలేషియాలో పర్యటించనున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు దేశంలో అధికారికంగా పర్యటించనున్నారు.ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడనున్నాయి.
ద్వైపాక్షిక సంబంధాలు...
భారత ప్రధాని నరేంద్ర మోదీ మలేషియాలో పర్యటించడం ఇది మూడోసారి. 2024, ఆగస్టులో ఇరు దేశాల మధ్య కుదిరిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ తర్వాత ప్రధాని మోదీ చేస్తున్న పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన ద్వారా అనేక ఒప్పందాలతో పాటు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది.