అంతర్జాతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్

అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-02-03 04:54 GMT

అంతర్జాతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్. దిగుమతి వస్తువుల పరిమితి పెంచుతూ కే్ంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా వరకూ వెసులుబాటు లభించనుంది. భారతదేశంలోకి సుంకం లేని దిగుమతి చేసుకున్న వస్తువులను తీసుకువచ్చే ప్రయాణికుల పరిమితిని 50,000 రూ.75,000 కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నేటి నుంచి అమలు...
ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త బ్యాగేజీ నియమాలు, 2026 ప్రకారం, భారతీయ నివాసితులు, భారత సంతతికి చెందిన పర్యాటకులు రూ.75,000 వరకు విలువైన వస్తువులను ఎటువంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా తీసుకురావచ్చు. విదేశీ సంతతికి చెందిన పర్యాటకులకు ఈ పరిమితి రూ.25,000గా ఉంది. అలాగే, విదేశాలలో 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం నివసించిన భారతీయ సంతతికి చెందిన మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, ఇతరులు 20 గ్రాముల వరకు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చు.


Tags:    

Similar News