రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది
RRB NTPC 2024 notifications
రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేలాది ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలయింది. దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయింది. దరఖాస్తు చేయని వారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలని రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు సూచించింది. మార్చి 2వ తేదీ వరకూ సమయం ఉంది.
దరఖాస్తు చేసుకోవడానికి...
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లో 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో సీబీటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. దరఖాస్తు ఫీజు రూ.500 రూపాయలుగా నిర్ణయించారు. SC, ST, PwBD, మహిళలకు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ సందర్శించవచ్చు.