Kejrival : కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు

అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.

Update: 2024-05-10 05:48 GMT

Article 370

అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. కేజ్రీవాల్‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో షాక్ ఇచ్చారు.లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ఈడీ ఈరోజు మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.

అందరిలోనూ ఉత్కంఠ...
ఆయన జైలుకు వెళ్లి నెలరోజులు దాటినా ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా ఎవరూ నియమితులు కాలేదు. ఆయన ఆదేశాలతో కేజ్రీవాల్ మంత్రివర్గమే పాలన చూసుకుంటుంది. ఈ సమయంలో ఆయనకు బెయిల్ వస్తుందా? రాదా? అన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో మరికాసేపట్లో బెయిల్ పై తీర్పు వెలువడనుంది.


Tags:    

Similar News