Supreme Court : చీఫ్ సెక్రటరీలపై సుప్రీం సీరియస్.. ఏపీ కూడా
వీధి కుక్కల కేసులో ఆదేశాల అమలు వివరాలు సమర్పించని రాష్ట్రాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
వీధి కుక్కల కేసులో ఆదేశాల అమలు వివరాలు సమర్పించని రాష్ట్రాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు నవంబర్ 3వ తేదీన కోర్టుకు హాజరుకావాలని సోమవారం ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజారియా లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 22వ తేదీన ఇచ్చిన తమ ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు కేవలం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ప్రభుత్వాలే అమలు అఫిడవిట్‌లు సమర్పించాయని బెంచ్ తెలిపింది.
ఇచ్చిన ఆదేశాలపై...
ఇతర రాష్ట్రాలు సమర్పించకపోవడంపై కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.ఆగస్టు 22వ తేదీన ఇచ్చిన ఆదేశాలను ఎందుకు నివేదికలు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని ప్రశ్నించింది. వీధి కుక్కలపై కోర్టు స్వయంగా తీసుకున్న సుమోటు కేసులో ఈ విచారణ జరిగింది. గత ఆగస్టు 22వ తేదీనన కోర్టు ఈ కేసు పరిధిని ఢిల్లీ–ఎన్‌సీఆర్ వరకు పరిమితం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. అలాగే, టీకాలు వేసిన కుక్కలను విడుదల చేయకుండా ఉన్న గతంలో ఉన్న ఆదేశాన్ని సవరించి, వాటిని శస్త్రచికిత్స, వాక్సినేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే విడిచిపెట్టాలని సూచించింది.