Supreme Court : ఉత్తారాది వరదలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఉత్తారాది వరదలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లనే వరదల తీవ్రత ఎక్కువగా ఉందని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు.
ఉత్తారాది వరదలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లనే వరదల తీవ్రత ఎక్కువగా ఉందని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. అడవులను, చెట్లను నరికి వేయడం వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడంతోనే ఇంతటి భారీ వరదలు సంభవిస్తున్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.
నోటీసులు జారీ చేసిన...
వరదల వల్ల సామాన్యులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని, ఆస్తులను కూడా పోగొట్టుకుంటున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. దీంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. కొండ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యం క్షీణిస్తుందని అన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రకమైన వ్యాఖ్యలు చేసింది.