విడాకులపై సుప్రీం కీలక నిర్ణయం

విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. విడాకులు ఇచ్చేందుకు న్యాయస్థానాలు ఆరు నెలలు వేచిచూడనక్కరలేదని పేర్కొంది.

Update: 2023-05-01 06:24 GMT

విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. ఇక విడాకులు ఇచ్చేందుకు న్యాయస్థానాలు ఆరు నెలలు వేచిచూడనక్కరలేదని పేర్కొంది. విడాకులు దంపతులు కోరగానే మంజూరు చేయవచ్చని తెలిపింది. ఇప్పటి వరకూ విడాకుల మంజూరు కోసం ఆరు నుంచి పద్దెనిమిది నెలలు వెయిట్ చేసే అవకాశం ఉంది.

కాలపరిమితిని...
అయితే ఇప్పుడు ఆ ఆరు నెలల కాలపరిమితిని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. విడాకులకు దంపతులు ఆసక్తి చూపిన వెంటనే జారీ చేయవచ్చని పేర్కొంది. ఇందుకు తగిన ఆదేశాలు జారీ చేసింది. విడాకుల మంజూరు కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News