19500 రూపాయల సబ్‌స్క్రిప్షన్ ఉచితం.. ఎవరికంటే?
గూగుల్ భారతదేశంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.
గూగుల్ భారతదేశంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ప్రో ప్లాన్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందించనుంది. ఇది 19500 రూపాయల విలువైంది ఈ సబ్‌స్క్రిప్షన్. విద్యార్థులు హోంవర్క్, రైటింగ్, వీడియో జనరేషన్‌లో సహాయం పొందేందుకు ఉచితంగా ఉపయోగించవచ్చు. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ విద్యార్థులు 12 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ను కాంప్లిమెంటరీ యాక్సెస్‌గా పొందవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో జెమినీ 2.5 ప్రో, వీయో 3 వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. జీమెయిల్, డాక్స్, ఇతర గూగుల్ యాప్స్‌లో 2టీబీ క్లౌడ్ స్టోరేజ్, ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.