సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్స్ చేసేవారికి షాక్.. ఇక జరిమానాల మోతే

వ్యాపారాన్ని త్వరగా విస్తరించుకోవచ్చన్నది ఆయా కంపెనీల ఆలోచన. కానీ.. ఆ ప్రమోషన్ చేసేవారు పెయిడ్ ప్రమోషన్ అని చెప్పరు.

Update: 2022-12-29 07:20 GMT

social media paid promotions

టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్స్ లో రీల్స్ చేసే సదుపాయం వచ్చా.. ప్రతినిత్యం కొన్ని లక్షల మంది అదే పనిగా రీల్స్ ను పోస్ట్ చేస్తుంటారు. డ్యాన్సులు, కామెడీ కంటెంట్, డైలీ రొటీన్ వ్లోగ్స్, వంటలు ఇలా రకరకాల రీల్స్ చేస్తుంటారు. ఫలితంగా వేలు, లక్షల సంఖ్యలో ఫాలోవర్లు వస్తారు. అలా తామూ సెలబ్రిటీలమయ్యామని ఫీలవుతూ.. డబ్బు కోసం కొన్ని ప్రమోషన్లు చేస్తుంటారు. అలాంటి వారికి షాకిస్తూ..కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేసేవారు.. ముందుగా పెయిడ్ ప్రమోషన్ అని ఖచ్చితంగా చెప్పితీరాల్సిందే. లేకపోతే.. రూ.50లక్షల జరిమానా వడ్డింపు తప్పదు.

ఉదాహరణకు యూట్యూబ్ లో మిలియన్లు, కోట్ల మంది సబ్ స్క్రయిబర్లను కలిగిన ఛానళ్లు చాలానే ఉన్నాయి. వీరికి ఉన్న ఫాలోయింగ్ తో కొన్ని కంపెనీలు వీరిని సంప్రదించి తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలని కోరుతుంటాయి. అందుకు కొంత ప్రతిఫలాన్ని ఇస్తుంటాయి. ఫలితంగా తమ వ్యాపారాన్ని త్వరగా విస్తరించుకోవచ్చన్నది ఆయా కంపెనీల ఆలోచన. కానీ.. ఆ ప్రమోషన్ చేసేవారు పెయిడ్ ప్రమోషన్ అని చెప్పరు. ప్రొడక్ట్ చాలా బాగుంది. మీరూ ఇదేవాడండి అని నాలుగు ముక్కలు చెప్తారు. వీరిని సోషల్ మీడియాపై ప్రభావితం చేసే వారిగా పరిగణిస్తున్నారు. ఇకపై అలాంటివారి ఆటలు సాగవు.
పెయిడ్ ప్రమోషన్ అని చెప్పకుండా వీడియోలు, పోస్ట్ లను పెట్టే వారిపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)కి యూజర్ ఫిర్యాదు చేయవచ్చు. విచారణ అనంతరం నిజమని తేలితే ఆయా వ్యక్తులు, చానళ్లపై రూ.50 లక్షల జరిమానా పడుతుంది. ఈ నెల 24 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలు కేవలం సోషల్ మీడియా ఛానళ్లకే కాకుండా, ఇతర సెలబ్రిటీలు, ఆర్థిక సలహాదారులు అందరికీ వర్తిస్తాయి.


Tags:    

Similar News