నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల ట్రయల్ కోర్టు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నమోదు చేసిన కేసును తిరస్కరించింది. దీంతో హైకోర్టు ను ఈడీ అధికారులు ఆశ్రయించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అధికారుల గతంలో విచారించారు.
హైకోర్టులో...
అయితే ట్రయల్ కోర్టులో ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేశారు. కానీ ట్రయల్ కోర్టు ఆ ఛార్జిషీటును తిరస్కరించింది. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో తీర్పు ఎలా వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సోనియా, రాహుల్ లు ఈ కేసులో నిందితులుగా ఈడీ చేర్చింది.