అసోంలో రైలు ఢీకొని ఎనిమిది ఏనుగులు మృతి

అసోంలోని హొజాయ్ లో ఎనిమిది ఏనుగులు మరణించాయి. రైలు ఢీకొని ఇవి మరణించాయి

Update: 2025-12-20 04:28 GMT

అసోంలోని హొజాయ్ లో ఎనిమిది ఏనుగులు మరణించాయి. రైలు ఢీకొని ఇవి మరణించాయి. అసోంలో ఈ ఘటన విషాదకరంగా మారింది. ట్రాక్ ను దాటుతుండగా రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ఏనుగుల గుంపును ఢీకొట్టింది. దీంతో ఎనిమిది ఏనుగులు మరణించాయి. ఈ ఘటనలో రాజధాని ఎక్స్ ప్రెస్ కు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.

ట్రాక్ దాటుతుండగా...
ఈ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమయింది. అసోంలో అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏనుగుల గుంపు అక్కడకు చేరుకుని ట్రాక్ దాటే సమయంలోనే ఈఘటన జరిగిందని తెలిసింది. దీంతో రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆ ప్రాంతంలో చాలా సేపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.


Tags:    

Similar News