ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గుడ్ న్యూస్

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2025-12-19 07:34 GMT

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక రైళ్లలోనూ రుసుము చెల్లించి అదనపు లగేజీని తీసుకెళ్లవచ్చని తెలిపారు. అధిక లగేజీకి అదనపు చార్జీ పై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. సెకండ్ క్లాస్ ప్రయాణికుడు ఉచితంగా 35 కేజీలు, అదనపు రుసుం చెల్లించి 70 కేజీలు తీసుకెళ్లవచ్చు. స్లీపర్‌ తరగతి ప్రయాణికులు ఉచితంగా 40 కేజీలు, రుసుం చెల్లించి 80 కేజీలు, ఏసీ త్రీ టైర్‌ ప్రయాణికులు ఉచితంగా, గరిష్ఠంగా 40 కేజీలు, ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టైర్‌ ప్రయాణికులు ఉచితంగా 50 కేజీలు తీసుకుని వెళ్లవచ్చని తెలిపారు.

అదనపు రుసుంతో....
అదనపు రుసుంతో 100 కేజీలు, ఏసీ ఫస్ట్ క్లాస్ ఉచితంగా 70, రుసుం చెల్లించి 150 కేజీలు తీసుకుని వెళ్లవచ్చు. ఐఆర్‌సీటీసీ-ఈ-వాలెట్‌’ నుంచి నగదు విత్‌డ్రాకు వీల్లేదని అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఐఆర్‌సీటీసీ ఈ-వాలెట్‌ ఖాతాలో డబ్బు జమచేసిన వారు దానిని టికెట్‌ బుకింగ్‌కు మాత్రమే ఉపయోగించగలరని కేంద్రం ఆ ఖాతాలోని నగదును ఉపసంహరించుకునే అవకాశం లేదని, అయితే ఈ-వాలెట్‌ ఖాతాను పూర్తిగా మూసివేసిన తర్వాత బ్యాలెన్స్‌.. సదరు వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాకు బదిలీ అవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభలో వెల్లడించారు


Tags:    

Similar News