రైలు వస్తుండగా పట్టాలపైకి ట్రాక్టర్.. మద్యం మత్తులో డ్రైవర్
తమిళనాడులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ట్రాక్టర్ ను నేరుగా రైలు పట్టాలపైకి తీసుకెళ్లాడో వ్యక్తి.
తమిళనాడులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ట్రాక్టర్ ను నేరుగా రైలు పట్టాలపైకి తీసుకెళ్లాడో వ్యక్తి. దీంతో రైలు ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ధాటికి ట్రాక్టర్ రెండు ముక్కలయింది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మద్యం మత్తు తలకెక్కడంతోనే రైలువస్తుందని చూడకుండా అతడు నేరుగా పట్టాలపైకి వెళ్లాడు.
గేటు వేసి ఉండకపోవడంతో...
గేటు వేసి ఉండకపోవడంతో మద్యం మత్తులో రైలు పట్టాలను దాటేందుకు మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ప్రయత్నించాడు. ట్రాక్టర్ సులువుగా పట్టాలు దాటేస్తుందని మత్తులో భావించాడు. కానీ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ట్రాక్టర్ రెండు ముక్కలయింది. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని పట్టాలపై పడిన ట్రాక్టర్ విడి భాగాలను తొలగించారు. ఈ ఘటన ఆశ్చర్యంతో పాటు మద్యం తీసుకువచ్చే తంటాను తెలియజేస్తుంది.