ఇండియా సీఈసీగా రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ కుమార్ నియామకం

రాజీవ్ కుమార్ ప్రస్తుతం ఈసీలో 2వ కమిషనర్ గా ఉన్నారు. కొత్త సీఈసీగా రాజీవ్ కుమార్ నియామక ఉత్తర్వులను ..

Update: 2022-05-12 11:06 GMT

న్యూఢిల్లీ : భారత నూతన ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. రాజీవ్ కుమార్ మే15న సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీకాలం మే 14వ తేదీతో పూర్తి కానుంది. 14న ఆయన పదవీ విమరణ చేయనున్నారు. కాగా.. 1984 బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్ కు చెందిన రాజీవ్ కుమార్ గతంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ గా, ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

రాజీవ్ కుమార్ ప్రస్తుతం ఈసీలో 2వ కమిషనర్ గా ఉన్నారు. కొత్త సీఈసీగా రాజీవ్ కుమార్ నియామక ఉత్తర్వులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 'రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లోని క్లాజ్ (2) ప్రకారం.. మే 15, 2022 నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గా రాజీవ్ కుమార్‌ను నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషిస్తున్నారు. రాజీవ్ కుమార్‌ కు నా శుభాకాంక్షలు' అని కిరన్ రిజిజు పేర్కొన్నారు.


Tags:    

Similar News