ఎన్నికల వేళ టీవీకే చీఫ్ సూపర్ సిక్స్ హామీలు ఇవే
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు ప్రకటించారు
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు ప్రకటించారు. తమ ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని తెలిపారు. సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఉచితంగా ఇస్తామని విజయ్ పేర్కొన్నారు. మహిళలకు ఆర్థిక చేయూత కింద రూ.15 వేలు అందచేస్తామని తెలిపారు. రేషన్ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తామని కూడా చెప్పారు. తమిళనాడులో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితం అమలు చేస్తామన్న విజయ్ మహిళలు, పిల్లలు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ – సీఎం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు.
మహిళా దినోత్సవం సందర్భంగా...
మహిళలకు నెలకు ₹2,500 భృతి (60 ఏళ్ల లోపు మహిళలకు) ఇస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 6 ఉచిత LPG గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. కుమార్తెల వివాహానికి 8 గ్రాముల బంగారం + పట్టు చీర ఇవ్వనున్నట్లు హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. చదువు మానకుండా ప్రతి తల్లి/గార్డియన్‌కు సంవత్సరానికి ₹15,000 ఆర్థిక సహాయం అందచేస్తామని తెలిపారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళలపై నేరాలపై జీరో టోలరెన్స్ – మహిళా భద్రత దళాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పానిక్ బటన్లు, CCTVలు ఏర్పాటు చేస్తామని విజయ్ చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ₹5 లక్షల వరకు వడ్డీ లేని రుణం, సబ్సిడీ అందచేస్తామని చెప్పారు.రాష్ట్రంలో పుట్టే ప్రతి శిశువుకు బంగారు ఉంగరం + బేబీ వెల్కమ్ కిట్ ను అందచేస్తామని తెలిపారు.