Delhi Bomb Blast : బాంబు పేలటానికి ముందు ఏం జరిగిందంటే?
ఢిల్లీ లో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో కొంత పురోగతి లభించింది
ఢిల్లీ లో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో కొంత పురోగతి లభించింది. పేలుడు జరగకంటే ముందు పేలుడుకు ఉపయోగించిన కారు రెడ్ ఫోర్ట్ పార్కింగ్ ఏరియాలో దాదాపు మూడు గంటలు నీలిపి ఉంచినట్లు తెలుస్తుంది. బ్లాస్ట్ జరిగే కొన్ని క్షణాల ముందు పార్కింగ్ ఏరియా నుండి కారు బయటకు తీస్తున్న సిసి ఫుటేజ్ ని పరిశీలించిన భద్రతా సిబ్బంది. ఈ కారుని నడుపుకుంటూ వెళ్తున్న వ్యక్తిని డాక్టర్ ఉమర్ మహమ్మద్ గా, తను జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. నిన్న మొన్న అరెస్టు జరిగిన డాక్టర్లతో లింక్ అయ్యి వున్న ఫరీదాబాద్ సెల్ కి సంబంధించిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఇది ఆత్మహుతి దాడిగా అనుమానిస్తున్నారు.
భారీ ప్రాణనష్టం చేయాలని...
గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న అరెస్టుల్లో వివిధ ప్రాంతాల నుండి కొంతమంది డాక్టర్లు, స్లీపర్ సెల్ వాళ్ళను , వారి వద్ద వందల కేజీలు లభించిన పేలుడు పదార్థాలు , ఏకే 47, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంటూ ఈ పూర్తి లింకును నిర్విఘ్నం చేసే దిశగా పోలీసు వ్యవస్థ పని చేస్తున్న సమయంలో డాక్టర్ ఉమర్ అహ్మద్ తను దొరికిపోయేముందు ఏదో ఒక పెద్ద పేలుడును చేసి అధిక మొత్తంలో ప్రాణ నష్టం జరపాలని తొందరపాటులో సూసైడ్ బాంబర్ గా మరి ఈ ఘటన జరిపి ఉంటాడని అనుమానిస్తున్నారు. గత రెండు మూడు రోజుల నుండి పోలీసులు దేశవ్యాప్తంగా దాడులు జరుపుతూ ఈ నెట్ వర్క్ ను దాదాపు నిర్వీర్యం చేశారు. అయినా ఈ దాడి జరగడంతో వీరి వెనక ఎవరున్నారన్న కోణంలోనూ ఈ దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ పేలుడులో తొమ్మిది మంది మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఫొటోను విడుదల చేసిన...
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటోను పోలీసులు తొలిసారిగా విడుదల చేశారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నెమ్మదిగా వెళుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కారు ముక్కలైంది. ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం కావడంతో ఎర్రకోటకు సెలవు ప్రకటించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేదంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మాహుతి దాడిగా భావిస్తున్న నేతలు శరీర భాగాల నుంచి ఆనవాళ్లు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.