మధ్యాహ్న భోజన పథకం ద్వారా 11.46 కోట్లను మాయం చేసిన ప్రధానోపాధ్యాయుడు
మధ్యాహ్న భోజన పథకం ద్వారా 11.46 కోట్లను మాయం చేసిన ప్రధానోపాధ్యాయుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లోని ప్రాథమిక విద్యా విభాగానికి చెందిన ఒక పాఠశాల ప్రిన్సిపాల్ మధ్యాహ్న భోజనం (MDM) పథకంలో భాగంగా వచ్చిన నిధులలో ఏకంగా ₹ 11.46 కోట్లను మాయం చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (NGO)ని నకిలీ పత్రాలను ఉపయోగించి ఏర్పాటు చేసాడు. బ్యాంకుల అధికారులు, ఇతర సిబ్బంది సహాయంతో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన డబ్బులతో ₹ 11.46 కోట్లు సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించాడని ఆగ్రా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (విజిలెన్స్) తెలిపారు. "ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ప్రాథమిక విద్యాశాఖలో ఉన్న ఉపాధ్యాయుడు చంద్రకాంత్ శర్మపై ఈ అవినీతి కేసు నమోదైంది. షికోహాబాద్ నివాసి. ఫిరోజాబాద్ జిల్లా తుండ్లలోని జాజుపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు." అని అలోక్ శర్మ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (విజిలెన్స్) తెలిపారు.