Narendra Modi : నేడు పుదుచ్చేరికి ప్రధాని

నేడు పుదుచ్చేరిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

Update: 2026-04-03 04:13 GMT

నేడు పుదుచ్చేరిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు మోదీ రోడ్ షో ఉండనుంది. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రస్తంగించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.

రోడ్ షోలో పాల్గొని...
ప్రధాని వరసగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా నేడు దక్షిణాదిన చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి ఎన్డీఏ నేతల మద్దతుగా రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే రోడ్ షో, సభలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News