Kerala : కేరళలో యూడీఎఫ్ ఆరు గ్యారంటీలివే
కేరళలో యూడీఎఫ్ ఎన్నికల మ్యానిఫేస్టోను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు
కేరళలో యూడీఎఫ్ ఎన్నికల మ్యానిఫేస్టోను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూడీఎఫ్ మ్యానిఫేస్టోను ప్రతిపక్ష నేత వి.డి. సతీష్ కు అందచేశారు. కేరళ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని మ్యానిఫేస్టోలో పేర్కొన్నారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం, వ్యాపారాలను ప్రారంభించుకునేందుకు నిరుద్యోగ యువతకు ఐదు లక్షల రూపాయల వడ్డీ లేని రుణం అందిస్తామని తెలిపింది. యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు మూడు వేల రూపాయల పింఛను అందచేస్తామని తెలిపారు.
ఆరోగ్య బీమా కింద...
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ పేరిట అన్ని కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకూ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని అందచేస్తామని పేర్కొంది. వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాఖ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆరు ఇందిరా హామీలను అమలు చేస్తామని తెలిపింది. తెలంగాణలోనూ తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, వచ్చి ఎవరైనా పరిశీలించుకోవచ్చని తెలిపారు.