Paralament : మూడు రోజులు ప్రత్యేక సమావేశాలు

పార్లమెంటు సమావేశాలు తిరిగి ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానున్నాయి

Update: 2026-04-03 02:55 GMT

పార్లమెంటు సమావేశాలు తిరిగి ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తెలిపింది. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ప్రకటించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నియోజకవర్గాల పెంపుతో పాటు మహిళ రిజర్వేషన్లపై చర్చించి చట్టాన్ని ఆమోదించనుంది.

కీలక బిల్లులను...
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ చట్టాన్ని తెచ్చే అవకాశముంది. లోక్ సభ స్థానాలను 543 నుంచి 816 స్థానాలకు పెంచుతూ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశముందని తెలిసింది. ఇందుకోసం మూడు రోజుల పాటు ఉభయ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 16,17,18వ తేదీల్లో లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి.


Tags:    

Similar News