Narendra Modi : నేడు కేరళకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కేరళలో పర్యటించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కేరళలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటించనున్నారు. పతనం తిట్ట జిల్లాలోని తిరువల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం తిరువనంతపురంలో జరిగే రోడ్ షో లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.
ఈ నెల 9న ఎన్నికలు...
కేరళ ఎన్నికలకు ఈ నెల 9వ తేదీన జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది మధ్యాహ్నం మూడు గంటలకు తిరువళ్లలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత తిరువనంతపురం లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.