Earth Quake : ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై ఎంతంటే?
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం వణికించింది
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం వణికించింది. ఉత్తర భారత దేశంలో పలు చోట్ల భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ ఎస్.సి.ఆర్ పరిధిలోని నోయిడా, గురుగ్రామ్ లతో పాటు పంజాబ్, హర్యానా,జమ్ము కాశ్మీర్ లలో జనం భయంతో ఇళ్లను, కార్యాలయాలను వదిలి బయటకు పరుగులు తీశారు.
రిక్టర్ స్కేల్ పై తీవ్రత...
రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.9 గా నమోదయింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారుల వివరాల మేరకు ఈ భూకంపం ఆప్ఘనిస్థాన్ లో దరావన్ సమీపంలో ఉందని తెలిపారు. పూంఛ్, శ్రీనగర్, చండీగఢ్ వంటి నగరాల్లోనూ ప్రజలు భయకంపితులయ్యారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలు చెందారు. ఢిల్లీలో ఈ ఏడాది రెండోసారి భూమి కంపించడమని ప్రజలు చెబుతున్నారు.