నేటి నుంచి ఐదు రాష్ట్రాలకు ప్రధాని మోదీ

నేటి నుంచి ఈ నెల పదిహేనో తేదీ వరకు ఐదు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు చేయనున్నారు

Update: 2025-09-13 03:28 GMT

నేటి నుంచి ఈ నెల పదిహేనో తేదీ వరకు ఐదు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు చేయనున్నారు. వరస పర్యటనలతో ప్రధాని మూడు రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలను కూడా చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మిజోరాం, మణిపూర్‌, అసోం, బెంగాల్‌, బీహార్‌లో పర్యటించనున్నారు.

అనేక పనులకు...
రూ.71,850 కోట్ల విలువైన పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మణిపూర్‌ హింస తర్వాత తొలిసారి ఆ రాష్ట్రానికి వెళ్తున్న ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు ను నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ మణిపూర్‌ పర్యటనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వాగతించారు.


Tags:    

Similar News