Narendra Modi : నేడు బీహార్ కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్ లో పర్యటించనున్నారు. దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

Update: 2025-09-15 02:59 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్ లో పర్యటించనున్నారు. దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. పూర్ణయి ఎయిర్ పోర్టును నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అలాగే బీహార్ రాష్ట్రంలో నాలుగు కొత్త రైళ్లను కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేడు జెండా ఊపి ప్రారంభించనున్నారు.

అభివృద్ధి కార్యక్రమాలను...
బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందే బీహార్ కు వరాల జల్లులు మరిన్ని ప్రకటించే అవకాశముంది. గత రెండు రోజుల నుంచి ప్రధాని నరంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు.


Tags:    

Similar News