Narendra Modi : ఐదు రోజుల విదేశీ పర్యటనకు ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి ఐదు రోజుల పాటు విదేశీపర్యటనలో పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి ఐదు రోజుల పాటు విదేశీపర్యటనలో పాల్గొంటారు. నేడు కెనాడకు బయలుదేరి వెళ్లారు. కెనడాలో జరిగే G7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. కెనడా ప్రధాని కోరిక మేరకు ఆయన G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉంటారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత...
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలి పర్యటన ఇదే. మూడు దేశాలను ఈ పర్యటనలో సందర్శిస్తారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా బయలుదేరి వెళతారు. ఇప్పటి వరకూ భారత ప్రధానులు ఎవరూ క్రొయేషియా దేశాన్ని అధికారికంగా సందర్శించలేదు. మొదట సైప్రస్ కు చేరుకునే ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత కెనడా చేరుకుని G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు.