Narendra Modi : సాయంత్రం మోదీ ప్రసంగం.. కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు అమలులోకి వస్తుండటంతో దానిపై ప్రధాని ప్రసంగం ప్రధానంగా సాగనుంది. జీఎస్టీ శ్లాబ్ ల మార్పుల వల్ల ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని ప్రధాని చెప్పనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు దసరా, దీపావళి కానుకగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించనున్నారు. జీఎస్టీ శ్లాబ్ ల మార్పుతో నిత్యావసరాలతో పాటు కొన్ని మందుల ధరలు కూడా గణనీయంగా తగ్గనున్నాయని చెప్పనున్నారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై...
దీంతో పాటు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశముంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై సుంకాలు పెంచడంతో పాటు H1B వీసా ఫీజును లక్ష డాలర్ల పెంచడంపై కూడా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చోటు కల్పించే అవకాశముంది. భారతీయ టెకీలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించనున్నది ప్రధాని మోదీ వివరించే అవకాశాలున్నాయి. అదే సమయంలో సుంకాల పెంపుతో నష్టపోయిన రంగాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసాను నరేంద్ర మోదీ తన ప్రసంగం ద్వారా ఇవ్వనున్నారు.