Narendra Modi : ఉగ్రవాదులకు మోదీ మాస్ వార్నింగ్
బీహార్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు
బీహార్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పర్యాటకులపై దాడి కాదని, ఇది దేశంపై దాడి అని ఆయన అన్నారు. ఉగ్రవాదులకు వారు ఊహించిన దాని కంటే ఎక్కువ శిక్షఫడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదులను మాత్రమే కాదు.. ఉగ్రనేతలను కూడా వదలి పెట్టే ప్రసక్తిలేదని ఆయన అన్నారు.
బీహార్ లో మాట్లాడుతూ...
ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పహాల్గామ్ ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉగ్రవాదులను వారిని ప్రోత్సహించే నేతలను విడిచిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు. త్వరలోనే దీని పర్యావసానం ఏంటో ప్రపంచం చూస్తుందని కూడా మోదీ హెచ్చరించారు. బీహార్ లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.