మోదీ అత్యవసర సమీక్ష

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో కరోనా పరిస్థితులను మోదీ సమీక్షించనున్నారు.

Update: 2021-11-27 05:36 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో కరోనా పరిస్థితులతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియపై మోదీ సమీక్షించనున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ చుట్టుకుంది. సౌతాఫ్రికా వేరియంట్ ఆందోళన కల్గిస్తుంది. డెల్టా వేరియంట్ కంటే సౌతాఫ్రికా వేరియంట్ మరింత ప్రమాదకరమని నిపుణులు చెప్పడంతో మోదీ ఈ అత్యవసర సమీక్షను నిర్వహిస్తున్నారు.

థర్డ్ వేవ్...
కరోనా కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దెబ్బతినింది. థర్డ వేవ్ చుట్టుకుంటే మరోసారి లాక్ డౌన్ విధించే పరిస్థితులు ఉంటాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉన్నత సమీక్షలో కరోనాపై మోదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News