Narendra Modi : యోగా కు హద్దులు లేవు.. మానవతను పెంపొందించే సామూహిక ప్రక్రియ

యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు

Update: 2025-06-21 01:57 GMT

యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని తెలిపారు. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ మైన విషయం కాదని మోదీ అభిప్రాయపడ్డారు. యోగా మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని మోదీ అన్నారు. పదేళ్లలో పది కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందని మోదీ అన్నారు.

వయసుతో పనిలేదు...
యోగాకు వయసుతో పని లేదని, యోగాకు హద్దులు లేవని, గ్రామ గ్రామాల్లో యువకులు యోగాను అనుకరించడం మంచి పరిణామమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ఆరోగ్యాంధ్రగా రూపు దిద్దుకుంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని మోదీ అన్నారు.


Tags:    

Similar News