మారిషస్ లో ప్రధాని నరేంద్ర మోదీ

నేటి నుంచి మారిషస్‌లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది.

Update: 2025-03-11 05:22 GMT

నేటి నుంచి మారిషస్‌లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. రెండు రోజుల పాటు మారిషస్‌లో మోదీ పర్యటించనున్నారు. మారిషస్ జాతీయ దినోత్సవంలో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పోర్ట్ లూయీస్ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయనకు మారిషస్ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

ఇరు దేశాల మధ్య...
రేపు మారిషస్ లో జరగనున్న 57 వ జాతీయ దినోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనేలా చర్చలు సాగనున్నాయి. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులం ఆహ్వానం మేరకు మారిషస్ లో పర్యటిస్తున్న మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిసంబంధాల మధ్య చర్చలు జరుగుతాయి. వాణిజ్యంతో పాటు ఇతర అంశాలపై ఒప్పందాలు చేసుకోనున్నారు.


Tags:    

Similar News