Narendra Modi : బ్రిటన్ లో మోదీకి గ్రాండ్ వెలకమ్
బ్రిటన్‍లో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమయింది. ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్ కమ్ లభించింది
బ్రిటన్‍లో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమయింది. ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. బ్రిటన్, భారత్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఈ సందర్భంగా అన్నారు. విమానాశ్రయంలో బ్రిటన్ లో ఉన్న భారతీయులు మోదీకి సాదర స్వాగతం చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేలా పర్యటన సాగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
నేడు బ్రిటన్ లో...
బ్రిటన్ రాజు ఛార్లెస్-3ని ప్రధాని మోదీ కలవనున్నారు. బ్రిటన్ లో నేడు వివిధ అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారు. బ్రిటన్ నుంచి రేపు మాల్దీవులకు ప్రధాని నరేంద్ర మోదీవెళ్లనున్నారు. మాల్దీవులలో స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నరేంద్ర మోదీ తర్వాత భారత్ కు తిరిగి రానున్నారు.