గుడ్ న్యూస్... గోల్డ్ దిగివచ్చింది

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.600లు, కిలో వెండి పై కూడా రూ.800 ల వరకూ తగ్గింది.

Update: 2022-08-11 02:20 GMT

బంగారం అంటేనే మహా ప్రీతి మగువలకు. బంగారం ఎంత తమ వద్ద ఉంటే అంత గౌరవం అని భావించే రోజులివి. అందుకే బంగారాన్ని కొనుగోలు చేయడానికి మగువులు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. బంగారం ఆభరణాలుగా చూసేవారు కొందరు. తమ వద్ద ఉన్న బంగారాన్ని చూసుకుని మురిసిపోయే వారు మరికొందరు. కష్టకాలంలో ఉపయోగపడుతుందనుకునే వారు మరికొందరు. ఇలా అందరూ బంగారం కొనుగోలు వైపు మొగ్గు చూపుతుండటంతోనే దానికి అంత డిమాండ్ పెరుగుతుంది. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ధరల గురించి పెద్దగా పట్టించుకోకుండా కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో బంగారం ధరలు పెరిగినా పెద్దగా ఎవరూ లెక్క చేయడం లేదు.

ధరలు ఇలా....
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.600లు తగ్గింది. కిలో వెండి పై కూడా రూ.800 ల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,650 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,350 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 64,200 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News