గుడ్ న్యూస్.. రెండో రోజూ తగ్గిన బంగారం ధర

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-11-19 03:51 GMT

రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తున్నా అనుకున్న స్థాయిలో మాత్రం ధరలు తగ్గడం లేదు. బంగారం ధరలు ఎప్పుడూ అంతే. పెరిగితే భారీగా, తగ్గితే స్వల్పంగా ధరలు తగ్గడం బంగారం విషయంలో సాధారణంగా జరుగుతుండేవే. కొనుగోలుదారులు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కొనుగోళ్లు మాత్రం యధాతధంగా జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు బంగారం ధరల హెచ్చు తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. కానీ జ్యుయలరీ షాపులు మాత్రం ఎప్పుుడూ కిటికిట లాడుతూనే ఉన్నాయి. పెళ్ళిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అందుకే జ్యుయలరీ షాపులు కొత్త కొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

ఈరోజు వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. కిలో వెండిపై మూడు వందల రూపాయల వరకూ తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,180 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,750 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మూడు వందలు తగ్గి 67,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News