గోల్డ్ రేట్స్ ఈరోజు ఇలా

దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర కూడా కిలో 500 రూపాయల వరకూ పెరిగింది

Update: 2022-11-21 03:33 GMT

పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగాం ధర ఈరోజు మాత్రం పెరిగింది. బంగారం అంటేనే అంతే మరి. పెరిగితే భారీగా, తగ్గితే స్వల్పంగా ధరలు ఉంటాయి. వినియోగదారులు కూడా దానికి అలవాటు పడిపోయారు. బంగారం ఇప్పుడు పది గ్రాములు యాభై మూడు వేల రూపాయలు దాటింది. అయినా కొనుగోలుదారులు లెక్క చేయడంలేదు. బంగారం ఎప్పుడు కొనాలనుకుంటే అప్పుడు కొనుగోలు చేస్తుండటం అలవాటుగా మార్చుకోవడంతో ధరలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

పెరిగిన వెండి ధర....
తాజాగా దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర కూడా కిలో 500 రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,020 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,600 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 67,500 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News