ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన మోదీ
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. పది గంటలకు తొలి ఓటును ప్రధాని నరేంద్ర మోదీ వేశారు.
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. పది గంటలకు తొలి ఓటును ప్రధాని నరేంద్ర మోదీ వేశారు. తర్వాత పంజాబ్ కు చెందిన పార్లమెంటు సభ్యలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు వేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు.
తర్వాత పంజాబ్ ఎంపీలు...
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పంజాబ్ ఎంపీలు ముందుగా పాల్గొని తర్వాత పంజాబ్ వెళ్లి ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనేందుకు బారులు తీరారు. ఇప్పటికే కొందరు ఓటు వేశారు. మరికొందరు క్యూ లైన్ లో ఉన్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. తర్వాత లెక్కింపు ప్రారంభం కానుంది.