Breaking : మావోయిస్టు కేంద్ర పార్టీ కమిటీ సెక్రటరీగా తిరుపతి
మావోయిస్టు కేంద్ర పార్టీ కమిటీ సెక్రటరీగా తెలంగాణకు చెందిన వ్యక్తినించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి నియమితులయ్యారు
మావోయిస్టు కేంద్ర పార్టీ కమిటీ సెక్రటరీగా తెలంగాణకు చెందిన వ్యక్తినించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి నియమితులయ్యారు. ఇటీవల వరస ఎన్ కౌంటర్లలో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగులుతుంది. వందల సంఖ్యలో కొన్ని నెలల నుంచి జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, తెలంగాణలలో జరిగిన ఎన్ కౌంటర్లలో మరణించారు.
సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్ గా...
కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులు ఏరివేతను 2026 నాటికి పూర్తి చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు స్థానంలో తిప్పిరి తిరుపతిని నియమించారు. ప్రస్తుతం సెంట్రల్ మిలటరీ కమిషన్ కు చీఫ్ గా తిరుపతి ఉన్నారు. గ్రీన్ హంట్ సమయంలో బెంగాల్ లోని లాల్ గఢ్ ఉద్యమానికి తిప్పిరి తిరుపతిని నియమించారు.