గుడ్ న్యూస్...గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయ్
వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి.
వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు పెట్రో ఉత్పత్తుల ధరలపై సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోనున్నాయి. ఇందులో భాగంగా కమర్షియల్ ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ చమురు సంస్థలు ప్రకటించాయి. తగ్గించిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.
వాణిజ్య సిలిండర్ ధరపై...
19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై 51.50 రూపాయలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో భారీగా కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గినట్లయింది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 1631 రూపాయల నుంచి 1580 రూపాయలకు చేరుకుంది. చిరు వ్యాపారులకు ఇది ఊరట అని చెప్పాలి. గృహా వినియోగదారులకు అందించే సిలిండర్ ధరలను యధాతధంగా ఉంచాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. పెట్రోలు, డీజిల్ ధరల్లో కూడా మార్పు లేదని చమురు సంస్థలు ప్రకటించాయి.