గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి.. గుడ్ న్యూసేగా?
చమురు సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
చమురు సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ ముడి సరుకుల ధరలపై ఆదారపడి ప్రతి నెల మొదటి తేదీ చమురు సంస్థలు గ్యాస్, పెట్రోలు ఉత్పత్తుల ధరలపై సమీక్ష చేయనుంది. అందులో భాగంగా ఈరోజు ఒకటోతేదీ కావడంతో సమీక్ష జరిపిన చమురు సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
19 కిలోల వాణిజ్య సిలిండర్...
19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 58.50 రూపాయల మేరకు తగ్గింది. అయితే గృహాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 1,665 రూపాయలకు చేరుకుంది. దీనివల్ల చిరు వ్యాపారులకు ఖుషీ కబురు అని చెప్పాలి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గితే హోటళ్లు, చిరు వ్యాపారులు కొంత ఊరట కల్గించినట్లవుతుంది.