Bihar : పదోసారి.. నితీశ్ ముఖ్యమంత్రిగా
బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు
బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్, జేపీనడ్డా, ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
మంత్రివర్గంతోపాటు...
243 నియోజకవర్గాలున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మొత్తం 202 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, జేడీయూ కూటమి లో నితీశ్ తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 14 మంది బీజేపీ, జేడీయూ నుంచి 9 మందికి, లోక్ జనశక్తి నుంచి ఇద్దరికి, రాష్ట్రీ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు లభించాయి.