Bihar : కోటి ప్రభుత్వ ఉద్యోగాల హామీతో ఎన్నికలకు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి మ్యానిఫేస్టోను విడుదల చేసింది
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి మ్యానిఫేస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీఏ ప్రకటించింది. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన సంకల్ప పత్ర పేరుగో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్జీపీ నేత చిరాగ్ పాశ్వాన్ కూడా పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను కల్పిస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.
కేజీ టు పీజీ వరకూ...
కేజీ టు పీజీ వరకూ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. ఏదాదికి కోటిమంది మహిళలను లక్షాధికారులుగా చేస్తామని మ్యానిఫేస్టోలో తెలిపారు. వ్యాపారాలు నిర్వహించుకునేందుకు రెండు లక్షల రూపాయల వరకూ ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పారు. కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి తొమ్మిదివేల రూపాయల పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో అందించనున్నట్లు హామీ పత్రంలో పేర్కొన్నారు. బీహార్ శాసనసభ ఎన్నికలకు మరికొద్దిరోజుల్లో పోలింగ్ జరగనుంది.