Narendra Modi : మోదీతో అజిత్ దోవల్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు
ప్రధాని నరేంద్ర మోదీ తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. అంతకుక ముందు అజిత్ దోవల్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమై సమీక్షించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకునేందుకు ప్రతి రోజూ ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశాలు వరసగా జరుగుతున్నాయి.
దాడులకు ప్రతిదాడులు...
పాక్ దాడులకు దిగుతుండటంతో దానిని తిప్పికొట్టడంతో పాటు ప్రతి దాడులను కూడా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి పాక్ కు సాయం అందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. భారత్ లో తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లపై ఈ సమావేశంలో కీలకంగా నిర్ణయం తీసుకోనున్నారు.