Narendra Modi : ప్రధాని పదవి చేపట్టి నేటితో పదేళు పూర్తి

ప్రధానిగా నరేంద్ర మోదీ నేటితో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. పదేళ్ల క్రితం ఈరోజు ఆయన ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు.

Update: 2024-05-26 02:50 GMT

ప్రధానిగా నరేంద్ర మోదీ నేటితో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. పదేళ్ల క్రితం ఈరోజు ఆయన ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు. నరేంద్ర మోదీ 2014 వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించింది. పదేళ్ల యూపీఏ పాలన చూసిన ప్రజలు ఎన్డీఏకు అవకాశమిచ్చారు. 2014 లో జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ విజయం సాధించింది.

ఈసారి గెలిస్తే...
దీంతో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ తరహా అభివృద్ధి దేశమంతటా జరుగుతుందని విశ్వసించడంతో ఎన్డీఏకు పట్టం కట్టారు. 2014 మే 26వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజుతో ప్రధాని పదవి చేపట్టి పదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచి తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీ ప్రధానిగా రికార్డును క్రియేట్ చేయబోతున్నారు.


Tags:    

Similar News