Narendra Modi : పదకొండేళ్లుగా మోదీ మార్క్ ఆఫ్ డైనమిజం పాలన.. దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతూ
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అనేక మంది రాజకీయ నాయకులు ఆయన నాయకత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు సేవా పక్షోత్సవాలను దేశవ్యాప్తంగా అక్టోబరు 2 వరకు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. కేంద్రం, రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఆరోగ్య శిబిరాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, మేధావుల సమావేశాలు, స్వదేశీ ఉత్పత్తుల ప్రదర్శనలు వంటి సేవా, అవగాహన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాయి.
మధ్యప్రదేశ్ లో పర్యటిస్తూ...
ప్రధాని మోదీ స్వయంగా మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పర్యటించి, మహిళలు–పిల్లల ఆరోగ్యం, పోషకాహారం పై దేశవ్యాప్త ప్రచారం ప్రారంభించారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరించారు. ఆయన సభలోనూ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశానికి మూడోసారి ప్రధాని కాగలిగారు. ప్రధాని మోదీ గత పదకొండు నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాలు, వివిధ దేశాలపై భారత్ అనుసరిస్తున్న తీరును విపక్షాలు సయితం ప్రశంసించేలా ఉన్నాయి.
సంక్షేమం - అభివృద్ధి...
ముఖ్యంగా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టించడంలో మోదీ ముందున్నారు. ఆయన ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు బీజేపీని చేరువ చేసేలా చేశాయి. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తో పాటు కాశ్మీర్ లోయలో శాంతి యుత వాతావరణం నెలకొనేలా చేయగలిగారు. కోట్లాది మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించారు. ప్రధాని మోదీ పహల్గామ్ దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ తో దాయాది పాకిస్తాన్ పై విరుచుకుపడిన తీరు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అక్కడ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఉగ్రవాద స్థావరాలనే మట్టుబెట్టి అంతర్జాతీయంగా కూడా మోదీ పాపులర్ అయ్యారు. ఆయన కు తెలుగు పోస్టు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది