కన్నడ ఎన్నికల్లో ఎంఐఎం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం పార్టీ ప్రకటించింది

Update: 2023-04-05 04:52 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం పార్టీ ప్రకటించింది. జేడీఎస్​ పార్టీతో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అందుకోసం దేవెగౌడతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. బీహార్, మహారాష్ట్ర వంటి చోట ఆ పార్టీ ఎమ్మెల్యే స్థానాలను కూడా దక్కించుకుంది. గుజరాత్ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. ముస్లిం ఓటు బ్యాంకును చీల్చడంతో గుజరాత్‌లో ఎంఐఎం బీజేపీకి లబ్ది చేకూర్చిందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.

జేడీఎస్‌తో పొత్తు
అయితే దక్షిణాదిన జరిగన తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసినా అక్కడ బోణీ కొట్టలేక పోయింది. కర్ణాటకలో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేేసేందుకు ఎంఐఎం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఒవైసీ కర్ణాటక ఎంఐఎం నేతలతో మాట్లాడారు. దాదాపు 25 స్థానాల్లో పోటీ చేసి కన్నడ శాసనసభలో అడుగుపెట్టాలని ఎంఐఎం భావిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ కాకుండా జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయింది. జేడీఎస్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశాలున్నాయి. ఇక్కడ కూడా బీజేపీకి లబ్ది చేకూర్చడానికే ఎంఐఎం బరిలోకి దిగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నా, ఆ పార్టీ మాత్రం తాము పోటీ చేస్తామని, గెలిచి తీరతామని ప్రకటించింది.


Tags:    

Similar News