మీడియా అత్యంత శ‌క్తివంత‌మైన‌ది : సుప్రీం కోర్టు

కొద్దిరోజుల క్రితం ఎన్నికల ర్యాలీల విషయమై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ "మీపై హత్యానేరం ఎందుకు మోపకూడదు?" అంటూ..

Update: 2022-05-04 07:04 GMT

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య నాలుగు మూల స్థంభాల్లో మీడియా ఒకటని, కోర్టుల్లో జరిగే విషయాలను ప్రజలతో మీడియా కమ్యూనికేట్ చేయగలదని జస్టిస్ వై.వి.చంద్రచూడ్, జ‌స్టిస్‌ల‌తో కూడిన బెంచ్ లో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యూ ఢిల్లీ ఉన్నత న్యాయస్థానాల్లో జరగిన చర్యల నుంచి మీడియాను నియంత్రించలేమని సుప్రీంకోర్టు తేల్చిపెప్పింది. అయితే ఎన్నికల కమిషన్ వేసిన పిటీషన్ పై సోమవారం విచారణ అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యానించింది.

కొద్దిరోజుల క్రితం ఎన్నికల ర్యాలీల విషయమై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ "మీపై హత్యానేరం ఎందుకు మోపకూడదు?" అంటూ కేంద్ర ఎన్నికల సంఘం పై తీవ్రంగా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల పై ఈసీ సుప్రీంను ఆశ్రయించింది. అనంతరం సుప్రీం కోర్టు స్పందిస్తూ "కోర్టుల్లో ఏం జరిగిందన్న విషయాన్ని మీడియా పూర్తిగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కోర్టులకు సంబంధించిన అంశాలను ఇది రిపోర్టు చేయజాలదని అనలేం. మీడియా చాలా శక్తివంతమైంది. అందుకే ప్రతి వ్యవస్థను ప్రజలతో అనుసంధానం చేసే సాధ‌నం మీడియా అని, దానిని నియంత్రించలేమని" సుప్రీం ధర్మాసనం పేర్కొంది.


Tags:    

Similar News