మావోయిస్టుల లొంగుబాటు.. మరొకవైపు భారీ డంప్ స్వాధీనం
ఛత్తీస్‌గఢ్‌లో 52 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు
ఛత్తీస్‌గఢ్‌లో 52 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 21 మంది మహిళలు ఉన్నారు. వీరంతా దండకారణ్యం స్పెషల్ జోన్, ఏవోబీకి చెందినవారు. వీరిపై రూ.1.41 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కగార్ ఆపరేషన్ తర్వాత ఛత్తీస్ గఢ్, ఒడిశా ప్రాంతాల్లో భారీగా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.
అటవీ ప్రాంతంలో...
మరొకవైపు చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా లోని బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్సిగ్‌బహార్ గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పేలుడు పదార్థాల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఆర్పీఎఫ్, క్వాట్, బీడీఎస్ బలగాలు ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. 10 కిలోల బరువున్న 3 పైప్ బాంబులు, 5 కిలోల బరువున్న 1 ప్రెషర్ కుక్కర్ ఐఈడీ స్వాధీనం చేసుకున్నాయి. బీడీఎస్ బృందం అక్కడికక్కడే అన్ని పేలుడు పదార్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేసింది.