Breaking : పార్టీ క్యాడర్ కు మల్లోజుల ఘాటు లేఖ
పార్టీ క్యాడర్ కు మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ బహిరంగ లేఖ రాశారు
పార్టీ క్యాడర్ కు మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ బహిరంగ లేఖ రాశారు. సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటనను మల్లోజుల చేశారు. అంతర్గతంగా చర్చించిన తర్వాతనే ఆయుధాలను వీడాలని మల్లోజుల తెలిపారు. పార్టీ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లనే ఇంతగా నష్టపోయామని మల్లోజల అన్నారు. తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవడం మంటే టీకా వేయడమేనని అన్నారు.
ఆయుధాలు వీడటంపై...
ఈ మేరకు క్యాడర్ కు మల్లోజుల పిలుపు నిచ్చారు. బహిరంగ లేఖతో ఆయన క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ కు కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే ఆయుధాలు వీడాలని తీసుకున్న నిర్ణయమని మల్లోజుల తెలిపారు. పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకు అనవసర త్యాగాలను పక్కన పెట్టాలని మల్లోజుల రాసిన లేఖలో పేర్కొన్నారు.