కండక్టర్ రూ.1 ఇవ్వలేదని కోర్టుకెళ్లాడు.. కీలక తీర్పు ఇచ్చిన కోర్టు

రమేష్ బీఎంటీసీ పై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు. మూడేళ్లుగా జరుగుతున్న ఈ విచారణలో..

Update: 2023-02-23 12:12 GMT

consumer protection

బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC)కి వ్యతిరేకంగా.. మూడు సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత బెంగుళూరుకు చెందిన వ్యక్తి రమేష్ నాయక్‌ కు వినియోగదారుల కోర్టు ఇటీవల సరైన న్యాయం చేసింది. 2019లో బెంగళూరులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న రమేష్ నాయక్ కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నాడు. అతనికి తిరిగి ఇవ్వవలసిన చిల్లరలో కండక్టర్ ఒక్క రూపాయి ఇవ్వలేదు. అదేమిటని అడిగితే.. ఒక్కరూపాయేగా అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.

శాంతినగర్‌ నుంచి మెజెస్టిక్‌ బస్‌ డిపోకు నాయక్‌ బీఎంటీసీ బస్సులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టిక్కెట్ ధర రూ.29 అవగా.. రమేష్ కండక్టర్ కు రూ.30 ఇచ్చాడు. తిరిగి ఒక రూపాయి ఇవ్వడానికి చిల్లర లేదన్నాడు కండక్టర్. దాంతో రమేష్ బీఎంటీసీ పై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు. మూడేళ్లుగా జరుగుతున్న ఈ విచారణలో.. తుది తీర్పు వెలువడింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత రమేష్ కు న్యాయం జరిగింది. ఒక్క రూపాయితో పోయేది.. ఇప్పుడు రూ.18 వేలు చెల్లించాల్సి వచ్చింది. నష్టపరిహారం కింద రూ.15 వేలు, లీగల్ ఫీజు రూ.1000, రమేష్ మూడేళ్లుగా కోర్టు చుట్టూ తిరిగినందుకు ఖర్చుల కింద మరో రెండు వేల రూపాయలు చెల్లించాలని జిల్లా వినియోగదారుల కోర్టు తీర్పునిచ్చింది.


Tags:    

Similar News