లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. సభకు రాను

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2026-02-10 12:24 GMT

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం తుది ఫలితం వెలువడేంత వరకూ తాను సభకు హాజరు కాబోనని తెలిపారు. స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్ సభ కార్యదర్శికి ఇవ్వడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఓం బిర్లా మహిళ పార్లమెంటు సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అవిశ్వాస తీర్మానంపై...
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడేందుకు సరైన అవకాశం ఇవ్వడం లేదని విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. ఈ అవిశ్వాస తీర్మానం పై కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సంతకాలు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా తాను అవిశ్వాస తీర్మానంపై తుది ఫలితం వచ్చేంత వరకూ స్పీకర్ ఛెయిర్ లో కూర్చోబోనని స్పష్టం చేశారు. మార్చి 9వ తేదీన స్పీకర్ పై అవిశ్వాసంపై చర్చ జరిగి ఓటింగ్ జరిగే అవకాశముంది.


Tags:    

Similar News