గుజరాత్ తీరానికిమరో ఎల్.పి.జి గ్యాస్ నౌక

భారత్‌కు మరో ఎల్‌పీజీ ట్యాంకర్ సురక్షితంగా చేరుకుంది

Update: 2026-03-28 02:48 GMT

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్‌కు మరో ఎల్‌పీజీ ట్యాంకర్ సురక్షితంగా చేరుకుంది. 'జగ్ వసంత్' అనే పేరు గల ఈ నౌక, 42,000 టన్నుల ఎల్.పి.జి గ్యాస్ తో శుక్రవారం గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు వచ్చింది. హర్మూజ్ జలసంధి మూసివేత భయాల నడుమ ఈ నౌక తన ప్రయాణ మార్గంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.

ఇరాన్ అనుమతితోనే...
సోమవారం 'పైన్ గ్యాస్' అనే మరో ట్యాంకర్‌తో కలిసి ప్రయాణం ప్రారంభించిన 'జగ్ వసంత్'.. సంప్రదాయ మార్గానికి బదులుగా ఖేష్మ్-లారక్ ఛానెల్ ద్వారా హర్మూజ్ జలసంధిని దాటింది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తమను స్పష్టంగా భారతీయ నౌకలుగా గుర్తించేందుకు 'IND SHIP AND CREW', 'JGVASNTINDSHIPINDCRW' వంటి సందేశాలను ప్రసారం చేశాయి. ఇరాన్ అధికారుల నుంచి ముందస్తు అనుమతితోనే ఈ నౌకలు ఇలా ప్రయాణించి ఉండొచ్చని భావిస్తున్నారు.


Tags:    

Similar News